రికార్డుల్లో పేరు మారింది


Thu,May 16, 2019 02:15 AM

Dharma Ganta Affect revenue officers

-అధికారుల తప్పిదం... వృద్ధరైతుకు శాపం కథనానికి స్పందన
టేక్మాల్: ఇరవై ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్యకు ధర్మగంట పరిష్కారం చూపింది. పాస్‌పుస్తకంలో తప్పుగా నమోదయిందని తనపేరు, తన తండ్రిపేరును సరిచేయాలని, 1999లో కొనుగోలు చేసిన 32 గుంటల భూమిని పాస్‌పుస్తకంలో ఎక్కించాలంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన నసీముద్దీన్ 20 ఏండ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పాస్‌పుస్తకంలో నసీముద్దీన్ పేరకు బదులుగా నశీమొద్దీక్ అని, తండ్రి పేరు సర్దార్ హుస్సేన్‌కు బదులుగా సర్దార్ అని నమోదయింది. అలాగే 1999లో కొనుగోలు చేసిన 32 గుంటల భూమిని నసీముద్దీన్ పాస్‌పుస్తకంలో ఎక్కించకుండా రెవెన్యూ అధికారులు తిప్పించుకుంటున్నారు.

బాధితుడు ధర్మగంటను ఆశ్రయించడంతో అధికారుల తప్పిదం.. వృద్ధరైతుకు శాపం అనే శీర్షికన నమస్తే తెలంగాణ లో కథనం ప్రచురితమైంది. దీనిపై టేక్మాల్ తాసిల్దార్ గ్రేసీబాయి స్పం దించి సమస్యను పరిష్కరించారు. పాస్‌పుస్తకంలో యజమాని పేరు ను సరిచేయడంతోపాటు, 20 ఏండ్ల కింద కొనుగోలు చేసిన 32 గుంటల భూమిని సైతం ఎక్కించారు. రైతు అందుబాటులో లేకపోడంతో కొత్త పాస్‌పుస్తకం నమూనా కాపీని నమస్తే తెలంగాణకు చూపించారు. సమస్య పరిష్కారమైన విషయం ఫోన్‌ద్వారా బాధిత రైతుకు తెలియజేయడంతో అతడు ఆనందం వ్యక్తంచేశాడు. తప్పుగా నమోదైన పేరు సరిచేయడంతోపాటు 20 ఏండ్లుగా తన పేరున మారని భూమి ధర్మగంటను ఆశ్రయించిన రెండు రోజు ల్లో మారడంతో నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.

460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles