శరవేగంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు!


Wed,June 19, 2019 02:39 AM

DGP Mahender Reddy Inspects Kaleshwaram Project Security Arrangements

-మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిరంతరం పనులు
-సిద్ధమవుతున్న హోమశాలలు, హెలిప్యాడ్లు, రహదారులు
-శిలాఫలకాల పనులూ ప్రారంభం.. గేట్ల మూసివేతతో బరాజ్‌లో నీటినిల్వ
-వెట్న్‌క్రు పంపుహౌస్‌లోకి చేరిన నీరు.. భారీగా పోలీసు బలగాల మోహరింపు
-భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ మహాఘట్టానికి ముహూర్తం సమీపిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నా యి. హోమశాలలు, హెలిప్యాడ్లు, రహదారు లు, శిలాఫలకాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యఅతిథులు మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకొని అక్కడ నిర్వహించే హోమంలో పాల్గొని బరాజ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారని అధికారులు చెప్పా రు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గరకు వస్తారు. అక్కడ మరో హోమాన్ని నిర్వహించిన తర్వాత పంప్‌హౌస్‌లోని మోటర్ల వెట్న్‌న్రు ప్రారంభిస్తారు.

kannepalli-pump-house2
అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి మోటర్లు గోదావరి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టం వద్దకు చేరుకొంటారు. మోటర్లు ఎత్తిపోసే గోదావరి నీటిని పరిశీలిస్తారు. ముఖ్యఅతిథుల రాకపోకల కోసం మేడిగడ్డ బరాజ్ వద్ద ఏడు, కన్నెపల్లి వద్ద ఆరు హెలిప్యాడ్‌లను సిద్ధంచేస్తున్నారు. వర్షం పడితే ఇబ్బంది కలుగకుండా హెలిప్యాడ్ల నుంచి హోమశాల, బరాజ్ గేట్ల వరకు బీటీ రోడ్లను నిర్మిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ వ్యూపాయింట్ వద్ద హోమశాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. బరాజ్‌లో ఏడు గేట్లను మూసివేసి గోదావరి జలాలను నిల్వచేస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర శిలాఫలకాలను ఏర్పాటుచేస్తున్నారు. వెట్న్ ప్రారంభం కోసం గోదావరిలో నిల్వ చేసిన నీటిని అప్రోచ్ కెనాల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్‌బేలోకి విడుదల చేశారు. నీటితో నిండిన పం పుహౌస్ ఫోర్‌బే ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు మంగళవారం మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ రమణారెడ్డి వెంట ఉన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడం వల్ల మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆయా ప్రాంతా ల్లో డ్రోన్ కెమెరాలు, వాహన తనిఖీలతో బం దోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుశాఖ అధికారులతో కన్నెపల్లి పంపుహౌస్ వద్ద సమావేశమై భద్రతాఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఐజీలు నాగిరెడ్డి, నవీన్‌చంద్, ప్రమోద్‌కుమార్, ఓఎస్డీ ఎంకే సింగ్, సీఐ సెల్ డీఐజీ రాజేశ్‌కుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ డీజీపీ వెంట ఉన్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డితోపాటు ఐజీ ప్రమోద్‌కుమార్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles