దేవాదుల స్టేజ్-2 అనుమతులకు కసరత్తు


Tue,September 11, 2018 12:56 AM

Devendra stage 2 sanction work

-అటవీశాఖకు డిపాజిట్ చెల్లించేందుకు ఉత్తర్వులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లోని ప్యాకేజీ ఐదులో అటవీ భూములకు సంబంధించి స్టేజ్-2 అనుమతి కోసం అవసరమయ్యే మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం సోమవారం పాలనా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్యాకేజీ-5లో భాగంగా రామప్పచెరువు నుంచి దుబ్బవాగు మీదుగా పాకాలచెరువును గోదావరిజలాలతో నింపడంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నర్సంపేట, ములుగునియోజకవర్గాల పరిధిలో 32,500ఎకరాలకు సాగునీరందించేందుకు పైప్‌లైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం 4.8121 హెక్టార్ల అటవీభూమి అవసరమున్నది. ఇప్పటికే స్టేజ్-1 అనుమతి రాగా.. స్టేజ్-2 అనుమతికిగాను ప్రభుత్వం రూ.3,99,08,413 అటవీశాఖకు డిపాజిట్ చేయాలి.
సమాంతర కాల్వ సర్వేకు నిధులు: లోయర్ మానేరుడ్యాం దిగువన కాకతీయకాల్వ 146-220 కిలోమీటర్ వరకు సమాంతరకాల్వ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు ప్రాథమిక సర్వే, అంచనాల రూపకల్పనకు రూ.47.70 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles