మీరే మా రియల్ హీరో..Sat,May 20, 2017 02:44 AM

అభివృద్ధి, సంక్షేమం, భద్రతలో ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్‌వన్
మా అందరికీ ఆదర్శం, స్ఫూర్తి.. ముఖాముఖితో పోలీసుల్లో ఆనందోద్వేగాలు

guns
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ముఖాముఖితో పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ భేటీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. తమ పట్ల సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన నమ్మకం వారికి స్ఫూర్తినిచ్చింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం ఐపీఎస్‌లతోపాటు ప్రతి పోలీసు అధికారినీ ఆకట్టుకుంది. వారంతా సీఎం ఇచ్చిన స్ఫూర్తితో కొండంత ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతామని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందిస్తాం. ముఖ్యమంత్రి కోరిక మేరకు మట్కా, గుట్కా, నకిలీ, కల్తీని ప్రాథమిక స్థాయిలోనే తుంచేస్తాం. ఎస్‌ఐ నుంచి డీజీపీ అధికారి వరకు జరిగిన ముఖాముఖి కార్యక్రమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మా అందరికీ అభిమాన హీరోగా మారిపోయారు అంటూ పలువురు అధికారులు ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రికి ఎవరూ పోటీకి రారని, ఆయనే నంబర్ వన్ అని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఆదర్శంగా వ్యవహరిస్తామని తెలిపారు.

షీ టీమ్స్ ఘనత సీఎం కేసీఆర్‌దే


Sumathi-DCP
మహిళల భద్రతలో షీ టీమ్స్ ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. షీ టీమ్స్ ఇప్పుడు మహిళలకు ఆయుధంగా మారింది. సీఎం ఆశయమైన షీ టీమ్స్ సేవలను మరింత సమర్థంగా నిర్వహిస్తాం.
- సుమతి, డీసీపీ నార్త్‌జోన్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్

ఇలాంటి సమావేశాలు చాలా అవసరం


Janki-SharimalDCP
ఈ సమావేశం పోలీసులు, ప్రభుత్వం ఒక కుటుంబమని నిరూపించింది. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి సంవత్సరం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శాఖలో నెలకొన్న ఏ సమస్యకైనా పరిష్కారమార్గాన్ని సూచిస్తుంది.
- జానకీ షర్మిల, డీసీపీ క్రైమ్స్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్

చరిత్రలో ఎప్పుడూ జరుగలేదు


Srinivas-SP-Adialabad
సివిల్ సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి పోలీసుశాఖలోని కింది స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఒకేసారి నేరుగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఎస్‌ఐ టు సీఎం కార్యక్రమం ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
- శ్రీనివాస్, ఎస్పీ, ఆదిలాబాద్

ఈ స్ఫూర్తి పోలీసుశాఖను పటిష్ఠపరుస్తుంది


Chaitanya-ACP-Warngal
ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ కార్యక్రమం పోలీసుశాఖను మరింతగా పటిష్ఠం చేస్తుంది. పోలీసుశాఖలోని కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చర్చించడం వల్ల చిన్న చిన్న విభేదాలు, లోపాలు, అసంతృప్తులు తొలిగిపోతాయి. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మనోబలాన్నిస్తుంది.
- చైతన్య, ఏసీపీ, వరంగల్ సిటీ

మాకు నమ్మకాన్నిచ్చింది


Srinivas-DSP-Palwancha
ఈ కార్యక్రమం మాకు ఓ నమ్మకాన్నిచ్చింది. మా పనితీరుకు ముఖ్యమంత్రి సరైన గుర్తింపునిచ్చారు. సమస్యలు చెప్పడానికి మాకు ఓ వేదికను ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని పెంచారు. ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పడూ చూడలేదు. మాకు కల్పిస్తున్న సౌకర్యాలతో నేరాలు జరుగకుండా కష్టపడి పనిచేస్తాం.
- శ్రీనివాసులు, డీఎస్పీ, పాల్వంచ డివిజన్

ముఖ్యమంత్రి గ్రేట్


Purnachder-inspector-Saifab
తెలంగాణను అభివృద్ధిలో నంబర్ వన్‌గా తీసుకెళుతున్న కేసీఆర్ ఇప్పుడు పోలీసులకు రియల్ హీరోగా నిలిచారు. స్వయంగా పోలీసు సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడం గ్రేట్. శాంతి భద్రతలు, ప్రజల రక్షణపై ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత మాకు మా సేవల ప్రతిష్ఠను గుర్తుచేసింది.
- పూర్ణచందర్‌రావు, ఇన్‌స్పెక్టర్, సైఫాబాద్

ఇది చాలా మంచి పరిణామం


Janreddy-SI-Nandipet
తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా పాత్రను గుర్తించడం ఆనందం కలిగించింది. మా సమస్యల పరిష్కారానికి ఇలాంటి వేదికలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. మా అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం, పరిష్కారానికి హామీ లభించడం మనోధైర్యాన్ని పెంచింది.
- జాన్‌రెడ్డి, ఎస్‌ఐ, నందిపేట, నిజామాబాద్

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం


Jalenderreddy--Si-Kalwakurt
మా సర్వీసులో ఇలాంటి సమావేశం ఎప్పుడూ చూడలేదు. సీఎం మాటలు మా బాధ్యతను పెంచాయి. హోంగార్డు, పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐలు, ఐపీఎస్ అధికారులు ఇలా ప్రతి ఒక్కరి సేవలను గుర్తించడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. సెల్యూట్ టు సీఎం కేసీఆర్.
- జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ కల్వకుర్తి (ఎస్‌హెచ్‌వో)

మమ్మల్ని గుర్తించడం ఆనందం కలిగించింది


Kranthikumar-si-surapet-tow
ఇలాంటి ప్రజాభివృద్ధిని కోరే సీఎంను తొలిసారి చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఐపీఎస్ అధికారుల వరకే ముఖ్యమంత్రులు మాట్లాడారు తప్ప ఎస్‌ఐ స్థాయి అధికారితో మాట్లాడలేదు. సీఎం కేసీఆర్ పోలీసుశాఖలో ప్రతీ అధికారి పాత్ర కీలకమని గుర్తించి మాట్లాడటం మానసిక సంతోషాన్నిచ్చింది.
- క్రాంతికుమార్, ఎస్‌ఐ సూర్యాపేట టౌన్ పోలీస్‌స్టేషన్

ముఖ్యమంత్రి మాకు ఆదర్శం


Srinivas-SI-Saroornagar
మేము ఈ తరహా కార్యక్రమాన్ని ఎప్పుడూ ఊహించలేదు. సీఎం ఇచ్చిన స్ఫూర్తి మాలో బాధ్యతను మరింత పెంచింది. ముఖ్యమంత్రి కోరుకున్నట్లు మట్కా, గుట్కాను ప్రాథమిక దశలోనే తుంచేందుకు కృషిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత దగ్గరవుతాం.
- శ్రీనివాస్, ఎస్‌ఐ, సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్
Mahila-Adikarulu

1988

More News

VIRAL NEWS