మహబూబ్‌నగర్ మళ్లీ శ్రీనివాస్‌దే!


Thu,December 6, 2018 02:50 AM

developed programs with thousand crores in mahabubnagar

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురడం ఖాయంగా కనిపిస్తున్నది. 50 ఏండ్లలో జరిగిన అభివృద్ధి.. గత నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ముక్తకంఠంతో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు హన్వాడ మండలం ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 3.04 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ముప్పావు భాగం పట్టణ ప్రాంతమైతే పావుభాగం గ్రామీణ ప్రాంతంగా ఉన్నది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వీ శ్రీనివాస్‌గౌడ్ తన సమీప ప్రత్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.

అభివృద్ధి పరుగులు

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నిరంతరం ప్రజల మధ్యే ఉన్నారు. నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మహబూబ్‌నగర్ పట్టణం అభివృద్ధి లో ముందు వరుసలో నిలిచింది. అదేసమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు నియోజకవర్గంలోని ప్రతి గడపకూ చేరాయి. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి పేరు తెచ్చాయి. నియోజకవర్గ ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే మొగ్గుచూపుతున్నారు.

ముమ్మర ప్రచారం

ప్రస్తుత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ ఇచ్చారు. తొలి విడుత కేటాయింపుల్లోనే శ్రీనివాస్‌గౌడ్ టికెట్ ఇచ్చారు. వెంటనే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గం మొత్తాన్ని చుట్టివచ్చారు. పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలికారు. తప్పకుండా గెలిపించుకుంటామని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మహాకూటమి అభ్యర్థిగా ఎర్ర శేఖర్, బీజేపీ అభ్యర్థిగా పద్మజారెడ్డి బరిలో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో వారికి టిక్కెట్లు దక్కడంతో ప్రచారంలో వెనుకబడ్డారు.
SRINIVAS-GOUD-trs2

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles