రెవెన్యూకు కొత్త చట్టం మంచిదే


Thu,April 18, 2019 02:53 AM

Deputy Collector Association President Lachi Reddy Speaks Over New Revenue Act

-ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-శాఖను మారుస్తున్నట్టు ప్రభుత్వం చెప్పలేదు
-ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
-రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న మచ్చను తొలిగించుకుందాం
-టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి పేర్కొన్నా రు. రెవెన్యూశాఖకు సంబంధించిన తాజా పరిస్థితులపై బుధవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ తాసీల్దార్‌ అసోసియేషన్‌ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూశాఖను మారుస్తున్నట్టు ప్రభుత్వం ఎక్క డా చెప్పలేదని స్పష్టంచేశారు. కొత్త చట్టాలు వస్తే మంచిదేనని, రెవెన్యూ ఉద్యోగుల బాధ్య త మరింత పెరుగుతుందని, ఉద్యోగులకు పదోన్నతులు, రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ వంటివి అధికంగా జరుగుతాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా చట్టాల అమలులో తమ వంతు కృషిచేస్తామన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని, ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న మచ్చను తొలిగించుకునే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో భూసమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత తమపైనే ఉన్నదని, ఒకవేళ సమస్యలు ఉంటే బోర్డుపై పెట్టాలని సూచించారు. రెవెన్యూశాఖను ఇతర శాఖలో కలుపుతామని ప్రభుత్వ పెద్దలు అనలేదని, ఈ విషయంలో ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. పలువురు రెవెన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను ప్ర భుత్వం పటిష్ఠంచేయాలని చూస్తున్నదని పే ర్కొన్నారు. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలుచేస్తే.. దానివల్ల ప్రజలకు మేలు జరుగడమే కాకుండా రెవెన్యూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, పదోన్నతుల ప్రక్రియ వంటివి అధికం గా జరిగే అవకాశం ఉన్నదన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న మచ్చను తొలిగించుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేయడంలో పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు లక్ష్మయ్య, భాస్కర్‌, తాసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయం

-నల్సార్‌ వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్‌
భూయజమానులకు టైటిల్‌ గ్యారంటీ దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని నల్సార్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. 1987లో ఈ దేశానికి టైటిల్‌ గ్యారంటీ అవసరమని మొదటిసారి ప్లానింగ్‌ కమిషన్‌ ఏర్పాటుచేసిన కమిటీ ప్రతిపాదించిందని చెప్పారు. అప్పటి ప్రణాళికాసంఘం డిప్యూటీ చైర్మన్‌ మన్మోహన్‌సింగ్‌, ప్రొఫెసర్‌ డీసీ వాద్వాల ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటుచేశారని తెలిపారు. 2008 వరకు ఆ వైపుగా ఎలాంటి ప్రయత్నాలు జరుగలేదని, క్లిష్టమైన సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగ్గదని వివరించారు. భూరికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే హామీ ఇవ్వడం, ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించడంపై సర్కారుచేస్తున్న ప్రయత్నాలు సఫలమై భూమి హక్కులకు పూర్తి హామీ ఇవ్వగలిగితే దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. భూ పరిపాలన వ్యవస్థలో మార్పులు లేకుండా టైటిల్‌ గ్యారంటీ ఇవ్వడం సాధ్యం కాదని, రైతులందరికీ భూమిహక్కును పూర్తి భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు జరుగాల్సింది ఆ భూములకు హక్కు హామీపత్రం ఇవ్వడం.. హక్కుకు హామీ ఇవ్వాలంటే ఇందులో టైటిల్‌ గ్యారంటీ అథారిటీ ఉండాలని సూచించారు. భూములను రిజిస్ట్రేషన్‌ చేసే ప్రత్యేక యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు.

కొత్త చట్టాన్ని స్వాగతిస్తాం టీజీటీఏ అధ్యక్షుడు గౌతమ్‌

కొత్త చట్టం వస్తే స్వాగతిస్తామని టీజీటీఏ అధ్యక్షుడు గౌతమ్‌ స్పష్టంచేశారు. రెవెన్యూశాఖ రద్దు అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమిష్టిగా ఖండించాలని పిలుపునిచ్చారు. కొత్త చట్టంలో రెవెన్యూ ఉద్యోగులం అందరం కీలక పాత్ర పోషించి ముందుకు వెళ్దామని చెప్పారు. టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ మంచిదేనని, సరైన విధానంలో అమలుచేస్తే పేదలకు, సామాన్య రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టాలు వస్తే ఉద్యోగుల బాధ్యత పెరుగుతుందని అన్నారు. శాఖలోని వీఆర్వో నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు ఎవరికీ నష్టం జరుగదని చెప్పారు.

ప్రభుత్వంపై నమ్మకం ఉన్నది వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు ఈశ్వర్‌

కొన్ని సంఘాలు స్వలాభం కోసం రెవెన్యూశాఖను రద్దు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు ఈశ్వర్‌ ఆరోపించారు. కొంత మంది రెవెన్యూ ఉద్యోగులు పదవులకు ఆశపడి ఇతర ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున సీఎం కేసీఆర్‌ను, మంత్రులను కలిసేందుకు అవకాశం లేదని తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాలను రెగ్యులర్‌ చేస్తే మరింత కష్టపడి పనిచేస్తామని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూశాఖ రద్దు ఏమాత్రం ఉండదని, ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పారు.

3715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles