అప్రమత్తతతో దీటుగా ఎదుర్కోగలం


Sat,September 14, 2019 12:40 AM

Dengue claims two more Telangana government cagey on death toll

- డెంగీ, సీజనల్ వ్యాధులపై హైకోర్టుకు అమికస్‌క్యూరీ నివేదిక
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డెంగీ, స్వైన్‌ఫ్లూ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులను ముందస్తు కార్యాచరణ, అవగాహనతో దీటుగా ఎదుర్కోవచ్చని అమికస్‌క్యూరీ నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల సన్నద్ధత, డెంగీ నివారణకు ముందస్తు చర్యలపై దాఖలైన పిటిషన్లలో అమికస్‌క్యూరీ పలు సూచనలు చేశారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాధుల నుంచి రక్షించుకునే చర్యలు, చికిత్సలపై వైద్యసమాజం అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యాధుల నిర్ధారణ కీలకమని, సకాలంలో చేస్తే.. చికిత్స అందించి మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పనిచేసి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అన్నారు. స్వైన్‌ఫ్లూను నిర్ధారించే కేంద్రాలు హైదరాబాద్‌లో కేవలం రెండు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది వ్యాధి నిర్ధారణ జోనల్ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు.

47
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles