రూ.25 కోట్లతో ప్రభుత్వ భవనాల నిర్మాణం

Mon,November 11, 2019 01:44 AM

-పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా
కరీంనగర్ క్రైం: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.25 కోట్లతో కొత్తగా పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణాలు, ట్రెజరీ ఆఫీసుల ఆధునీకరణ, ఇతర శాఖల పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్నట్టు ఆ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా తెలిపారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలకు కొత్త భవనాలు, జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయాలు, సబ్ ట్రెజరీ అధికారి కార్యాలయాల ఆధునీకరణ పను లు ఎక్సైజ్, విద్యా, అటవీ, వ్యవసాయ శాఖల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాల ఆధునీకరణ పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. మంజూరైన పనులన్నీ ఆన్‌లైన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసి పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయ భవన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయనీ, డిసెంబర్ మొదటి వారంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles