పట్టా ఒకరిది పరిహారం మరొకరికి


Fri,July 12, 2019 02:03 AM

Dalit woman to beg for justice for victims

-మెదక్ జిల్లా చిన్నశంకరంపేట అధికారుల నిర్వాకం
-న్యాయం కోసం బాధిత దళిత మహిళ వేడుకోలు

చిన్నశంకరంపేట: పట్టాదారు కాకుండా మరో రైతుకు రెవెన్యూ అధికారులు నష్టపరిహారాన్ని అందించి చేతులు దులుపుకొన్నారు. నష్టపరిహారం కోసం పట్టాదారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. రెవెన్యూ అధికారులు తనను నిలువునా ముంచారని పట్టాదారు అయిన బాధిత దళిత మహిళ వాపోతున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో 132/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ఆ గ్రామ శివారులోని 345 సర్వే నంబర్‌లో 10.18 ఎకరాల భూమిని 12 మంది రైతుల నుంచి సేకరించారు. ఈ రైతులంతా గతంలో ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందినవారే. ఇది అసైన్డ్ భూమి కావడంతో రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం అందించింది. ఇందులో చిన్నశంకరంపేటకు చెందిన ఆడపడుచు నాగవ్వ 1.19 ఎకరాల భూమిని కోల్పోయారు.

నాగవ్వకు అందాల్సిన నష్టపరిహారం సొమ్మును రెవెన్యూ అధికారులు మరో రైతుకు అం దించారు. ఈ విషయం తెలుసుకొన్న పట్టాదారు నాగవ్వ రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. కాస్తులో ఉన్న రైతుకే నష్టపరిహారాన్ని అందించామని సమాధానమిచ్చారు. తాను ఎవరికీ భూమి విక్రయించలేదని ఆమె చెప్తున్నారు. ఒకవేళ విక్రయించి ఉంటే ఆ భూమికి సంబంధించిన రైతుబంధు పథకం సొమ్ము తనకే ఎందుకు వచ్చిందని ఆమె అధికారులను నిలదీస్తున్నారు. అర్హురాలిని అయిన తనకు నష్టపరిహారం అందించి తగు న్యాయంచేయాలని నాగవ్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తిచేశారు.

సర్వే ప్రకారమే పరిహారం అందించాం

చిన్నశంకరంపేటలో 132/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సేకరించిన భూములకు ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించా రు. నాగవ్వ పేరిట 1.19 ఎకరాల పట్టా భూమి ఉన్నది వాస్తవమే. ఆ భూమిని ఆమె అమ్ముకున్నందున సర్వే ప్రకారం కాస్తులో ఉన్న రైతులకే నష్టపరిహారం అందించాం.
- రాజేశ్వర్‌రావు, చిన్నశంకరంపేట తాసిల్దార్

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles