ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి


Tue,September 11, 2018 12:36 AM

CS Joshi  Video Conference with collectors on election arrangements

-ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సీఎస్ జోషి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల బృందం రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.

ఎన్నికల సమయంలో అదనపు బాధ్యతలు వద్దు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమను అదనపు విధుల నుంచి తప్పించాలని తహసీల్దార్ల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాశ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇబ్బంది కలుగుతున్నదని వారు చెప్పారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు కే గౌతమ్‌కుమార్, కోశాధికారి రాములు, ప్రతినిధులు రామకృష్ణ, విష్ణుసాగర్ ఉన్నారు.

592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles