కాయ్ రాజా కాయ్


Sun,June 16, 2019 03:02 AM

Cricket Betting Gang Arrested in Telangana

-పాతకాలం బెట్టింగ్‌కు గుడ్‌బై
-స్మార్ట్ ఫోన్లపై పరుగులు తీస్తున్న బెట్టింగ్ దందా
-ఆన్‌లైన్‌లో బెట్టింగ్.. వ్యాలెట్‌తో చెల్లింపులు
-దాయాదుల మ్యాచ్‌పై పోలీసుల నజర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఆదివారం జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఒక్క హైదరాబాద్‌లోనే వంద కోట్లకు పైగా బెట్టింగ్ దందా సాగుతున్నట్టు సమాచారం. దీనిపై పోలీస్ కమిషనరేట్లు పటిష్ఠ నిఘా పెట్టడంతో బుకీలంతా సురక్షిత స్థావరాలకు జంప్ అయినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు ఒక గదికి పరిమితమై టెలిఫోన్ల ద్వారా తీసుకొనే బెట్టింగ్‌లను ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తూ వ్యాలెట్లతో చెల్లింపులు జరుపుతున్నారు. దాయాదుల పోరు దగ్గరపడటంతో బెట్టింగ్ బాబులు రహస్యంగా లావాదేవీలు జరుపుతున్నారు. నగరానికి చెందిన చాలా మంది బుకీలు గోవా, మహారాష్ట్ర, బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి బెట్టింగ్‌లు జరుపుతున్నట్టు సమాచారం. ప్రధానబుకీలు సొంత వెబ్‌సైట్లు రూపొందించుకుని వాటి లింకులను పందెంరాయుళ్ళకు ఇస్తున్నారు. వ్యాలెట్ల ద్వారా నగదు చెల్లించిన తర్వాత అందే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్డ్‌ల ద్వారా బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఒక్కో డిపాజిట్‌కు బుకీ పాయింట్స్ కేటాయించి గెలిచినవారు సాధించిన పాయింట్ల ఆధారంగా డబ్బు చెల్లిస్తారు. ఈ విధానంలో బెట్టింగ్ పోలీసుల కంటపడే అవకాశం తక్కువగా ఉండటంతో బుకీల ఆటలు మూడు వికెట్లు.. ఆరు పరుగులుగా కొనసాగుతున్నాయి. అయితే పోలీసుల నిఘా పెరుగడంతో పందెంరాయుళ్ళు కూడా బెట్టింగ్ దందాల గురించి బహిరంగంగా మాట్లాడటంలేదు.

2286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles