రైలు దిగుతూ దంపతుల మృతి

Mon,November 11, 2019 01:15 AM

-విశాఖ జిల్లా దువ్వాడలో ఘటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దంపతులు మృతిచెందారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గరివిడి మండల వెదుళ్లవలస గ్రామానికి చెందిన వెంకటరమణారావు (40), భార్య మణి (35)తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న రైలులో దువ్వాడలోని అత్తగారింటికి ప్రయాణమయ్యాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో దువ్వాడకు రైలు చేరగా స్టేషన్ గమనించక కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఇద్దరూ మృతిచెందారు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

68
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles