విలక్షణ యువనేత కేటీఆర్


Thu,December 6, 2018 02:50 AM

Country Favorite Young and talented leader Ktr

సాధారణంగా రాజకీయాల్లో క్లాస్ లేదా మాస్ లీడర్ ఉంటారు. ఆయన మాత్రం రెండూను. ఒక్క ట్వీట్ చాలు ఆయనను చేరుకోవడానికి. ప్రజల దృష్టిలో మనసున్న మారాజు. సిరిసిల్ల కార్మికులతో మమేకం కాగలరు. సిలికాన్ వ్యాలీ కంపెనీల సీఈవోలనూ ఆకట్టుకోగలరు. ఇలాంటి నాయకులు చాలా అరుదు. మన దేశంలోనే ఇంత సమర్థుడైన యువ నాయకుడు మరొకరు లేరు. ఆయనే తెలంగాణ రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారక రామారావు. దేశం మెచ్చిన యంగ్, టాలెంటెడ్ లీడర్ కేటీఆర్.

అమెరికా వాణిజ్యవేత్త టిమ్ కుక్ సమక్షంలో కేటీఆర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలనే ఆకర్షించింది. తమ దేశంలో ఈ వీడియో పాపులర్ అయిందని చైనా పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ప్రజలతో మమేకం అవడానికి, పరిపాలనా పరంగా ఆయన అటు ఆఫ్‌లైన్‌ను, ఇటు ఆన్‌లైన్‌ను రెండింటినీ విస్తృతంగా ఉపయోగిస్తారు. కేటీఆర్ శైలి కారణంగానే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఐటీ వాడకం బాగా పెరింది. మరోవైపు పారదర్శకతా సాధ్యమైంది. ప్రభుత్వానికి ఆదాయమూ అధికమైంది. ట్విటర్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఫేస్‌బుక్‌లో అయితే మినిస్టర్ ఫర్ ఐటీ అకౌంట్‌కు, కేటీఆర్ టీఆర్‌ఎస్ అకౌంట్‌కు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రజలకు సాయమైనా, సమస్య అయినా ఆయన తక్షణం స్పందిస్తారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేస్తారు. బాధితులకు వైద్యం అందేలా చూస్తారు.

పరిపాలనకు ఒక హ్యూమన్ టచ్ ఇవ్వడం కేటీఆర్ ప్రత్యేకత. పని జరిగేంత వరకు ఆయనలోని పట్టుదల, నిబద్ధతలు చెక్కుచెదరవు. ఆయన సినిమాలు చూస్తారు. పుస్తకాలు చదువుతారు. సలాడ్స్ ఎక్కువగా ఇష్టపడతారు. వైట్ షర్ట్, ఖాకీ ప్యాంట్ ఆయనకు ఇష్టమైన డ్రెస్. ప్రతి సోమవారం ఖద్దరు డ్రెస్ వేసుకుంటారు. ఖద్దరుకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. రాష్ట్రంలో హ్యాండ్లూమ్ సేల్స్ బాగా పెరిగాయి. సిరిసిల్లలో అపారెల్ పార్క్, వరంగల్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శ్రీకారం చుట్టారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపారు. టీమ్ సభ్యులైనా, కార్యకర్తలైనా, సామాన్యులైనా అందరితో కలిసిపోతారు. వేదిక ఏదైనా నవ్వులు పూయిస్తారు. ప్రొఫెషనలిజం ఆయనలో ఉట్టిపడుతుంది. ఆయన ప్రసంగం సూటిగా, సుస్పష్టంగా ఉంటుంది. అవసరాన్నిబట్టి వ్యంగ్యంగానూ మాట్లాడగలరు.

ఇప్పుడాయన పట్ల తెలంగాణ ప్రజల్లో మంచి ధీమా ఉంది. తెలంగాణకు తదుపరి తరం నాయకుడిగా తెలంగాణ ప్రజలు ఆయన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు. వ్యక్తుల్లా ఇవాళ ఉంటాం. రేపు ఉండం. అదే మనం నిర్మించిన సంస్థలైతే మనల్ని ఎల్లకాలం నిలబెడతాయి అన్నది ఆయన వైఖరి. స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్‌ను మలిచారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టి-హబ్‌ను ఏర్పరిచి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. టాస్క్, వీ-హబ్, టీ-వర్క్స్, టీ-ఫైబర్, టీ-శాట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఆయనే ఆద్యుడు. గూగుల్, యాపిల్, అమెజాన్, ఉబర్, సేల్స్ఫోర్స్, జడ్‌ఎఫ్, డీబీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు తెలంగాణలో అడుగు పెట్టాయంటే కేటీఆర్ నాయకత్వ సమర్థత వల్లే! దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని అద్భుత పారిశ్రామిక విధానం (టీఎస్ ఐ-పాస్) ఇక్కడ రూపుదిద్దుకొన్నది. టీఎస్ ఐ-పాస్ ద్వారా 2018 జూలై నాటికి 6,700 యూనిట్లకు అనుమతులు ఇచ్చారు. రూ.1,35,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సంఖ్య పరోక్షంగా అయితే రెండింతల పైమాటే. ఇవేకాదు, పాలనలో ఆయన తీసుకొచ్చిన విలక్షణ మార్పులు అనేకం. అందుకే, ఆయన యువతరం మెచ్చిన హీరో.
- నూగూరి మహేందర్, జర్నలిస్ట్

1947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles