సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం


Thu,May 23, 2019 01:44 AM

correct the errors


కటకం భూమయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం

లోపాలను సవరించాలి

రెవెన్యూ వ్యవస్థలో విధానపరమైన లోపాలను సవరించి పటిష్ఠంగా అమలుచేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలి. అవినీతిని అంతమొందించడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. సమూల ప్రక్షాళనతోనే ఏండ్ల తరబడి రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి నిర్మూలన సాధ్యమవుతుంది. ప్రభుత్వశాఖల్లో సమూల మార్పులు వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సామాన్య ప్రజలకు డబ్బులు ఇవ్వనిదే పనులు కాని తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.
- కటకం భూమయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం, చొప్పదండి, కరీంనగర్ జిల్లా


గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, రైతు

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా అమలుచేయడమే కాకుండా భూములకు పక్కా పత్రాలు ఉండేలా రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళనచేయాలన్న నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అవినీతిని అంతమొందించేందుకు రెవెన్యూలో మార్పులకు శ్రీకారం చుట్టడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. రైతుల, ప్రజల పక్షాన నిలబడి నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
- గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చొప్పదండి, కరీంనగర్ జిల్లా

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles