సీనియర్ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ అరెస్ట్


Wed,June 12, 2019 02:09 AM

congress senior leader chandra shekar arrested

ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లు
మంథని, నమస్తేతెలంగాణ: నిరుద్యోగులకు ఉ ద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయ లు వసూలు చేసి పరారీలో ఉన్న కాంగ్రెస్‌నేత, ఉమ్మడి కరీంనగర్ మాజీ గ్రంథాలయ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బంధు వైన పనకంటి చంద్రశేఖర్‌ను సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. మం థని సీఐ మహేందర్ కథనం ప్రకారం.. చంద్రశేఖర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఉద్యోగాలిప్పిస్తానని ఓ ముగ్గురి వద్ద కలిపి మొత్తం రూ.14 లక్షలు వసూలు చేసినట్టు గ తంలో అతడిపై ఫిర్యాదులు అందాయి. ఆ కేసులో చం ద్రశేఖర్ పరారీలో ఉన్నా డు. చంద్రశేఖర్‌పై మంథని కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు పోలీస్ ప్రత్యేక బృందం చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరు పర్చగా.. జడ్జి అతనికి 15 రోజుల కస్టడీ విధించారు.

1169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles