మేడ్చల్‌ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల లొల్లి

Tue,January 14, 2020 02:46 AM

- దళిత మహిళ కాళ్లమీదపడ్డా పట్టించుకోని రేవంత్‌రెడ్డి
మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: మేడ్చల్‌ కాంగ్రెస్‌లో మున్సిపల్‌ టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. తనకు టికెట్‌ ఇవ్వాలంటూ ఓ దళిత మహి ళ కాళ్లమీద పడివేడుకున్నా కాంగ్రెస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. మేడ్చల్‌లోని మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ క్యాంపు ఆఫీస్‌లో కాంగ్రె స్‌ బీ ఫాంలను ఎంపీ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పార్టీ నాయకులు పలువురు.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారిని లోపల కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు.


ఒకే ఇంటికి రెండు టికెట్లు కేటాయించి నలభై ఏండ్లుగా పార్టీలో కట్టుబడి పనిచేసిన తమ కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని దళిత మహిళ సుధ ఆరోపించారు. కార్యాలయం నుంచి వెళ్లిపోతున్న రేవంత్‌రెడ్డి కాళ్లమీదపడి ఆమె వేడుకునేందుకు ప్రయత్నించగా.. పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అటు వెనుకాలే వచ్చిన కేఎల్‌ఆర్‌ను నిలదీసి తమకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేయడంతో లొల్లిగా మారింది. కాళ్లమీద పడ్డా తన్నుకుంటూ పోవడం దళితులను కించపర్చడమేనని.. తమను పైకి రాకుండా అణగదొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. టికెట్‌ ఇవ్వకుంటే బండా రం బయటపెడుతామని హెచ్చరించారు.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles