టీఆర్‌ఎస్‌లో చేరికల జోష్


Wed,September 12, 2018 01:42 AM

Congress leaders queuing up to join TRS

న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధపార్టీల నేతలు, టీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో వివిధపార్టీలకు చెందిన 55 మంది టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 300 మంది వడ్డెరసంఘం సభ్యులు టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్ సమక్షంలో.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్, మోర్తాడ్ మండలాలకు చెందిన వివిధపార్టీల నాయకులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో.. చింతలమానేపల్లిలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబాబాద్ జిల్లా కందికొండలో 30 కుటుంబాలు తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమక్షంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్‌పేటలో కాంగ్రెస్ ఎంపీటీసీ బాలమ్మ, 50 మంది కార్యకర్తలు నాగర్‌కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి సమక్షంలో..సూర్యాపేట జిల్లా కుక్కడంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, గ్యాదరికిశోర్ సమక్షంలో వివిధపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం అభ్యర్థి ఎస్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి సమక్షంలో 150 మంది మహిళలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ నిరంకుశవైఖరికి విసుగుచెంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు కాంగ్రెస్ నాయకుడు చీటీ ఉమేశ్‌రావు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ సమక్షంలో..

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంత్రి కే తారకరామారావు సమక్షంలో మంగళవారం ముదిరాజ్ మహాసభకు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు అమరేందర్, ఇతర సభ్యులు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు తెలంగాణ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆనందలింగం, వీరశైవ సమాజం జిల్లా కార్యదర్శి సిద్ధిరామప్ప, జిల్లా బీసీ మహాసభ ప్రచార కార్యదర్శి మెట్టుకాడి శ్యాంసుందర్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నాగర్‌కర్నూల్ అధ్యక్షుడు నిరంజన్, జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు వేణుగోపాల్, తెలంగాణ బీసీ మహాసభ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు సత్తయ్యచారి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎంపీ కవిత ఆధ్వర్యంలో..


MBNR-KTR1
నిజామాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్వర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో అన్వర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నేతలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అయ్యేందుకు అన్వర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles