కాంగ్రెస్ నేతల వీరంగం


Tue,April 16, 2019 01:32 AM

congress leaders Attacks on TRS activists houses

-టీఆర్‌ఎస్ కార్యకర్తల ఇండ్లపై దాడి
-పలువురికి గాయాలు, 30 ఇండ్లు ధ్వంసం
-నల్లగొండ జిల్లాలోని నాయకుని తండాలో ఉద్రిక్తత

తిరుమలగిరి (సాగర్): నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం నాయకునితండాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుల ఇండ్లపై కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి దాడికి తెగబడ్డారు. రాళ్లు, కర్రలు, జిలెటిన్‌స్టిక్స్‌తో దాడి చేయడంతో సుమారు 30 ఇండ్లు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరా ల ప్రకారం.. శనివారం సపావత్‌తండాకు చెంది న సపావత్ మంగ్తానాయక్(80) అనారోగ్యంతో మరణించాడు. అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీఆర్‌ఎస్ నాయకు డు మేరావత్ సకృనాయక్, స్వామినాయక్ వెళ్లారు. అక్క డే ఉన్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మేరావత్ బిచ్చాలు, మేరావత్ సేవా టీఆర్‌ఎస్ నాయకులను హేళనచేస్తూ మాట్లాడారు. ఇంటికి వెళ్లిన అనంతరం స్వామినాయక్ తన కుమారుడు దత్తుకు విషయం తెలిపాడు.

ఆదివారం దత్తు ఈ విషయమై కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకున్నది. రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు జిలెటిన్ స్టిక్స్, రాళ్లు, కర్రలు, బీరు సీసాలతో దాడి చేయడంతో సుమారు 30ఇండ్లు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యాయి. టీఆర్‌ఎస్ కార్యకర్తలు మేరావత్ సోమ,నాగులు, మూడావత్ దస్లీ, సాలికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న సాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్యగౌడ్ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.

1017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles