మూల సిద్ధాంతాలకే తిలోదకాలు


Tue,September 11, 2018 01:35 AM

Congress and TDP set for poll alliance in telangana

-కాంగ్రెస్ పంచన టీడీపీ
-అనైతిక పొత్తుల కోసం నేడు భేటీ
-తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీల క్యాడర్
-రాజీనామాల బాటలో హస్తం నేతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ అదే పార్టీ పంచన చేరడానికి రంగం సిద్ధమయింది. మూల సిద్ధ్దాంతాలను మరిచి ప్రజలను వంచించడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్ల్లూ తెరచాటున సహకరించుకున్నవారు బహిరంగ దోస్తీకి సిద్ధమయ్యారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పొత్తులపై భేటీకానున్నారు. ప్రజల సంక్షే మం, అభివృద్ధి అంశాలను గాలికొదిలేసి ఆంధ్ర పార్టీని నెత్తిమీద పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమయింది. 130 ఏండ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 119 సీట్లు ఉన్న తెలంగాణలో అన్ని స్థానాల్లో కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేని దుస్థితిలో చేతులెత్తేసింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు లభిస్తున్న ప్రజాదరణ దృ ష్ట్యా పొత్తులు ఉంటే తప్ప డిపాజిట్లు దక్కడం కష్టమనే నిర్ధారణకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ ఇతర పార్టీల సాయాన్ని కోరడానికి సిద్ధమయింది.

ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న టీటీడీపీ నేతలు టీజేఏఎస్ నేత కోదండరాంను సోమవారం రహస్యంగా కలిశారు. మంగళవారం మరోసారి నాలుగుపార్టీల నాయకులు భేటీ అయి పొత్తుపై అధికారిక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. టీటీడీపీ-సీపీఐ మధ్య పొత్తు పొడవగా టీజేఏఎస్‌తో పొత్తు ప్రాథమికంగా ఖరారైంది. టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తుపై రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యనాయకుల మధ్య అవగాహన వచ్చింది. అనైతిక పొత్తును కిందిస్థాయి క్యాడర్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది.కలిసి పనిచేయడానికి ససేమిరా అం టున్నారు. కొందరు ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా మరికొందరు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు అదేపార్టీ నాయకులతో కలిసి ఏవిధం గా పనిచేయాలంటూ టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles