ప్రగతిచక్రం పరుగు

Wed,October 23, 2019 02:09 AM

-సమ్మెలోనూ ఆగని బస్సు
-ఫలించిన ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-రవాణా, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ సమన్వయం
-సీఎం కేసీఆర్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తం
-మంత్రి పువ్వాడ, ఉన్నతాధికారుల నిరంతర సమీక్షలు
-ప్రయాణికులకు తొలిగిన రవాణా ఇబ్బందులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చిత్తశుద్ధి, సమన్వయం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనవచ్చని నిరూపించింది తెలంగాణ ప్రభు త్వం. ఆర్టీసీసంఘాల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దసరా పండుగ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైననాటి వరకు ప్రజారవాణా వ్యవస్థను సాధారణ స్థితికి తెచ్చే క్రమంలో ప్రభుత్వం చూపిన చొరవ ప్రశంసలు పొందుతున్నది. శాఖలు వేరైనా సమన్వయంతో ముందుకు వెళ్లి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర కు వందశాతం సేవలు అందించాలనే లక్ష్యం తో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నామని అంటున్నారు. రోజురోజుకీ రవాణా ఏర్పాట్లు మెరుగుపడుతుండటంతో అధికారు లు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వందశాతం ఆర్టీసీ బస్సులు నడిపేందుకు వీలుగా చర్యలను ముమ్మరం చేశారు. మంగళవారం సాయం త్రం ఆరు గంటల వరకు 3888 ఆర్టీసీ, 1433 అద్దె బస్సులు కలిపి మొత్తం 5,321 బస్సులు నడిచాయని ఆర్టీసీ ప్రకటించింది. 3,888 మంది ప్రైవేట్ డ్రైవర్లు, 5,321 ప్రైవేట్ కండక్టర్లు విధులు నిర్వహించారని తెలిపింది.

పండుగ పూట మొదలైన సమ్మె...

ఆర్టీసీ సంఘాలు సమ్మె ప్రకటించడంతో పం డుగకు ఊళ్లకు ఎలా వెళ్లాలో తెలియక ప్రజలు ఆందోళన చెందారు. పరిస్థితులను ముందుగానే గమనించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా మందస్తు చర్యలకు ఉపక్రమించింది. సాధ్యమైనన్ని ఆర్టీసీ బస్సులను తిప్పడంతోపాటు, ప్రైవేటు వాహనాలకు తాత్కాలిక అనుమతులిచ్చింది. సీఎం కేసీఆర్ పరిస్థితిని సమీక్షిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ, ఇతర అధికారుల సమన్వయంతో విధులు నిర్వర్తించా రు. డిపోల్లో ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించింది. ప్రతి ఆర్టీవో కార్యాలయ పరిధిలో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేసి ప్రయాణికుల రద్దీ ప్రకారం బస్సులను అధికారులు ఏర్పాటుచేశారు.

డిపోల్లో ఉన్న బస్సులకు అ దనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలవారీగా కలెక్టర్లు పరిస్థితులను పర్యవేక్షించారు. డీఆర్వో లేదా ఆర్డీవోలు డిపోకు ఒకరు చొప్పు న నోడల్ అధికారులగా వ్యవహరించారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసుశాఖ పూర్తిస్థాయిలో పర్యవేక్షించింది. డిపోలవారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయడంతోపాటు, బంద్ రోజున ఎలాంటి ఘటనలు జరుగకుండా సంయమనంతో వ్యవహరించింది. దీంతో విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రవాణా వ్యవస్థ కొనసాగుతున్నది. రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అద్దెబస్సుల టెండర్లపై స్టేకు నిరాకరణ

ఆర్టీసీలోకి అద్దె బస్సులను తీసుకునేందుకు సంస్థ యాజమాన్యం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైర్‌పథకం కింద 1,035 బస్సులకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదలచేసిందని, సమ్మె కొనసాగుతుండటంతోపాటు కోర్టు కేసు లు పెండింగ్‌లో ఉండగా నోటిఫికేషన్ జారీచేయడం తగదని టీఎస్‌ఆర్టీసీ కార్మికసంఘ్ పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈ పిటిషన్‌ను ప్రధాన పిటిషన్లకు కలుపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles