ఏపీలో జనవరి 26 నుంచి అమ్మఒడి


Fri,July 12, 2019 01:23 AM

CM YS Jagans Amma Vodi scheme to start from next January 26 2020

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేఏడాది జనవరి 26 నుంచి అమ్మఒడి ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హులైన ప్రతితల్లికి ఈ పథ కం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరుస్తామని, విద్యాప్రమాణాలను పెంచుతామన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజన పథకంలో రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందిస్తామని చెప్పా రు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టినా.. తెలుగును తప్పనిసరి చేశామని మంత్రి గుర్తుచేశారు.

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles