పెద్దలసభలో తెలుగుపెద్ద పుస్తకాన్ని ఆవిష్కరించినఏపీ సీఎం జగన్


Wed,June 12, 2019 02:12 AM

CM YS Jagan Launches book on C Narayana Reddy

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, కవి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) పార్లమెంట్ ప్రసంగాల సంకలనం పెద్దలసభలో తెలుగు పెద్ద పుస్తకాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సినారె ప్రసంగాల పుస్తకం తన చేతులమీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని జగన్ అన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, పుస్తక సంకలనకర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జాతీయ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం, రైతునేస్తం పబ్లికేషన్స్ అధిపతి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

93
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles