ఫెడరల్ ఫ్రంట్‌లోకి ప్రాంతీయ పార్టీలు


Thu,May 16, 2019 02:18 AM

cm kcr tuning south sentiment to attract regional parties for federal front

-సంకీర్ణంలో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర
-టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్టయితే ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతాయని టీఆర్‌ఎస్ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఏ జాతీయ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతాయని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఎన్డీయే, యూపీఏలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ప్రాంతీయ పార్టీల కన్సార్షియంగా ఉంటుందన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని, జేడీఎస్, జేడీయూ వంటి పార్టీలు కూడా ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే అవకాశమున్నదని చెప్పారు. ప్రాంతీయ పార్టీల నేతలందరితో సీఎం కేసీఆర్ టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles