ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజా సదారాం


Sat,September 16, 2017 02:26 AM

CM KCR Review Meeting with RTC Officials

కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి

KCR-Meeting
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ సోమరాజు సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి నియామకమయ్యారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కూడిన కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమావేశమై.. వీరి పేర్లను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. కమిషనర్‌లను నియమిస్తూ సీఎస్ ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలిసారి ప్రగతిభవన్‌కు వచ్చిన ప్రతిపక్ష నేత జానారెడ్డికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, అధర్‌సిన్హా, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు పాల్గొన్నారు.
raja-sadaram

డాక్టర్ సోమరాజు సదారాం

జననం: 25-8-1955 సామాజికవర్గం: బీసీ-డీ
సొంతూరు: వరంగల్ నగరం
విద్యార్హత: ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ
అనుభవం: 1976 ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రిపోర్టర్‌గా విధుల్లో చేరారు. 2004లో కౌన్సిల్‌ను పునరుద్ధరించిన తరువాత 2007 నుంచి 2009 వరకు కార్యదర్శి హోదాలో కౌన్సిల్ సచివాలయం ఇంచార్జిగా పనిచేశారు. 2009 నుంచి ఎనిమిదేండ్లు అసెంబ్లీ సచివాలయ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సచివాలయ కార్యదర్శిగా పనిచేశారు. 2013లో రాష్ట్ర పునర్విభజన బిల్లు సమయంలో సెక్రటరీగా విధుల నిర్వర్తించారు. మొత్తం 41 ఏండ్లు వివిధ హోదాల్లో అసెంబ్లీలో పనిచేశారు.
ఇతరాలు: తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ సహకారంతో సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రపతి, రాజ్యసభ, మండలి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. రాజ్యాంగంపై, న్యాయశాస్త్ర నిబంధనలపై లోతైన అవగాహన ఉంది. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న అనుభవం ఉంది.
budda-murali

బుద్దా మురళి

జననం: 2-4-1964 సొంతూరు: తుర్కపల్లి, యాదాద్రిభువనగిరి జిల్లా
నివాసం: హైదరాబాద్ విద్యార్హత: ఎంఏ పొలిటికల్ సైన్స్
అనుభవం: 30 ఏండ్లుగా ఆంధ్రభూమి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మెదక్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో పనిచేశారు. ప్రస్తుతం చీఫ్ రిపోర్టర్ హోదాలో ఉన్నారు.
రచనలు: జనాంతికం, ఓటమే గురువు అనే పుస్తకాలను రచించారు. రాజకీయ పరిణామాలపై వందల సంఖ్యలో వ్యాసాలు రాశారు. ఆంధ్రభూమి డైలీలో 16 ఏండ్ల నుంచి జనాంతికం పేరుతో రాజకీయ వ్యంగ్యకాలం రాస్తున్నారు. మాసపత్రికలో నాలుగేండ్లుగా వర్తమానం శీర్షికతో కాలం రాస్తున్నారు. అరడజను కథలు రాశారు.
కుటుంబసభ్యులు: భార్య అనిత, పిల్లలు కీర్తన, కావ్య.

2220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles