అప్రమత్తంగా ఉండండి


Thu,May 23, 2019 01:53 AM

CM KCR Meeting With Party Leaders In Pragathi Bhavan

-వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఉండాలి
-ప్రజలు టీఆర్‌ఎస్ వైపే.. గెలుపు మనదే
-పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్
-ప్రజలు టీఆర్‌ఎస్ వైపే.. గెలుపు మనదే
-పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఓట్ల లెక్కింపు సమయంలో కౌటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని పార్టీ నాయకులకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యనాయకులతో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గెలుస్తున్నామనే ధీమాలో లెక్కింపుపై నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. చివరి రౌండ్‌తోపాటు వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఏజెంట్లు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీవీప్యాట్ల లెక్కింపులో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలువనున్నారని ఇప్పటికే జాతీయ స్థాయి సంస్థల సర్వేలు కూడా పేర్కొన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలువనున్నారని చెప్పారు.

ఇదిలాఉంటే.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బుధవారం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఓట్ల లెక్కింపుపై సూచనలు చేశారు. అభ్యర్థులు, మంత్రులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు అయితేనే తెలంగాణవాణిని లోక్‌సభలో బలంగా వినిపించగలుగుతారని ప్రజలు విశ్వసించారని, అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఏకపక్షంగా ఓట్లు వేశారని అన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నిరకాల తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను కోరుకున్నారని చెప్పారు. పార్టీ అభ్యర్థులు అందరూ గెలువనున్నారన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణభవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పార్టీ కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నందున ఫలితాలు వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు.

1431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles