మన వెలుగులు దిక్సూచి


Wed,April 24, 2019 02:03 AM

CM KCR is a key figure in national politics

-దేశానికే ఆదర్శంగా విద్యుత్ వ్యవస్థ
-దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక భూమిక
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో/ సైదాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయ రంగానికి విరామంలేని విద్యుత్‌ను సరఫరాచేస్తూ దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నెలరోజుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక భూమిక పోషించబోతున్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ చంపాపేటలో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ మూడో జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లా డారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చిమ్మ చీకటి అవుతుందని మాట్లాడిన వారికి గుణంపాఠం చెప్పేవిధంగా ముఖ్యమంత్రి ఏడాదిన్నర కాలంలోనే వెలుగుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూపించారని అన్నారు.

ప్రభుత్వ సలహాదారుడు ఎస్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరికీ సీఎం కేసీఆర్ న్యాయంచేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుండటంతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఎండీ జీ రాఘుమారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలు తమకు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ అధ్యక్షులు ఎన్ పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎండీ ప్రభాకర్‌రావు , ఎండీ రాఘుమారెడ్డిలకు అందజేశారు. అనంతరం టీఈఈ (1104) యూనియన్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, టీఈఈ 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ సుధీర్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్, యూనియన్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ కార్యదర్శి రామకృష్ణానంద్, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles