ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు


Thu,March 14, 2019 05:02 AM

cm kcr extends birthday greetings to MP Kavitha

-నిండునూరేండ్లు ప్రజలకు సేవలందించాలి : సీఎం కేసీఆర్
-శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, హరీశ్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె అభిమానులు కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకొన్నారు. విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ కవిత జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ కవితకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కవిత నిండునూరేండ్లు ప్రజలకు సేవలందించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు సీఎం పేర్కొన్నారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కలకాలం సంతోషంగా, ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో సుదీర్ఘకాలం ఉండాలని కోరుకుంటున్నట్టు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఎంపీ కవితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ప్రజలకు సేవలందించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో..

టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో బుధవారం ఎంపీ కవిత జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ భారీ కేక్‌ను చేశారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే నారాయణ, శారద, నాయకులు మారయ్య, ఆనంద్, సత్యనారాయణ, మారుతిరావు, నాగేశ్వర్ రావు, శ్రవణ్, రాము, నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, మారుతి, నిర్మలారెడ్డి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలో..

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవ వేడుకలను టీఆర్‌ఎస్ ఖతర్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగాని, ఉపాధ్యక్షులు బందారపు శోభన్‌గౌడ్, నర్సయ్య డెనికెని, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పడకంటి, కోశాధికారి ప్రమోద్ కేతే తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో..

ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, ఆడిలైడ్ పట్టణాలలో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా వేడుకలు నిర్వహించారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో కవిత దీర్ఘాయుష్షు కోసం శివవిష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

1020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles