కేసీఆర్ నిర్ణయాలు బాగున్నాయి


Thu,May 16, 2019 03:01 AM

cm KCR decisions are awesome

రైతుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. రైతుబంధు ద్వారా పెట్టుబడికి ఎకరాకు నాలుగు వేలు అందిస్తున్నారు. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పించి రైతు బాంధవుడిగా మారారు. ఇప్పుడు రైతుల భూ రికార్డుల్లో ఉన్న తప్పులను తొలిగించి భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలతో రైతులంతా ఆనందంగా ఉంటున్నరు. రైతుల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి అదృష్టం.
- అమరవరపు బక్కయ్య, కల్మల్‌చెర్వు రైతు, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా


మాలి లింగారెడ్డి

సమస్యలు పరిష్కారమవుతున్నాయి

నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరిట ధర్మయుద్ధం ప్రారంభమైన నాటినుంచి రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించి రైతుల భూమి సమస్యలు పరిష్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్ మొదటినుంచి సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటూ నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూశాఖలో ఏండ్లుగా పేరుకుపోయిన పనులు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ఇంతటి సాహసోపేత కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన సీఎం కేసీఆర్‌కు, నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మాలి లింగారెడ్డి, సూర్యాపేట

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles