వింజమూరి అనసూయాదేవి కన్నుమూత


Mon,March 25, 2019 03:38 AM

CM KCR condoles death of radio commentator Dr Vinjamuri Anasuya Devi

-అలనాటి ప్రముఖ గాయని,రేడియో వ్యాఖ్యాత
-వృద్ధాప్యంతో అమెరికాలో మృతి
-సంతాపం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
-వృద్ధాప్యంతో అమెరికాలో కన్నుమూత
-జయజయజయ ప్రియ భారతతో ప్రఖ్యాతి
-సంతాపం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ జానపద, శాస్త్రీయ, లలిత సంగీత గాయని.. రేడియో వ్యాఖ్యాతగా ప్రసిద్ధిచెందిన వింజమూరి అనసూయాదేవి(99) ఇక లేరు. అమెరికాలోని హ్యుస్టన్ నగరంలో ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అమెరికాలో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్న కుమార్తె, నృత్యకారిణి రత్న వద్ద ఆమె ఉంటున్నారు. అనసూయాదేవి మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతోపాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ను అమెరికాలోనే నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Anasuyadevi1

జానపద గేయాలకు ప్రాచుర్యం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న అనసూయాదేవి జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. ఎనిమిదేండ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయ్యింది. అనేక జానపద గేయాలకు ప్రాణం పోశారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, రచయితగా రాణించారు. హార్మోనియం వాయించడంలో ఆమె దిట్ట. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ, సుభాష్‌చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖుల ఎదుట దేశభక్తి గీతాలను ఆలపించారు. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ప్రముఖ దేశభక్తి గీతం జయజయజయ ప్రియ భారత గేయానికి బాణికట్టారు. స్వాతంత్య్ర సమరంలో ఈ గేయం ఉద్యమకారుల్లో ఎంతో స్ఫూర్తినింపింది. ఆలిండియా రేడియాలో వ్యాఖ్యాతగా పనిచేస్తూ జానపద గేయాలకు ఎనలేని ప్రాచు ర్యం కల్పించారు.

అనసూయాదేవి రాసిన భావగీతాలు, జానపదగేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 ఏండ్లు నిండిన సందర్భంగా 2008 ఏప్రిల్ 12వ తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. జానపద సంగీతంపై ఆమె దాదాపు ఏడు పుస్తకాలను విడుదలచేశారు. 1977లో అనసూయాదేవికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఆమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని, ప్యారిస్‌లో క్వీన్ ఆఫ్ ఫోక్ బిరుదు అందుకున్నారు. ఆలిండియా రేడియోలో ప్రముఖ లలిత సంగీత దర్శకురాలు వింజమూరి సీతాదేవికి ఆనసూయాదేవి సోదరి. 2016లో సీతాదేవి కన్నుమూశారు.
Anasuyadevi-CMKCR

3465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles