ప్రగతిభవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Wed,September 4, 2019 01:18 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రగతిభవన్‌లో సోమవారం వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. మట్టి గణపతికి నిర్వహించిన పూజా కార్యక్రమం లో సీఎం కే చంద్రశేఖర్‌రావు దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతోపాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


రాజ్‌భవన్‌లో పాల్గొన్న గవర్నర్ దంపతులు

రాజ్‌భవన్ స్టాఫ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. గవర్నర్‌గా విశిష్టసేవలు అందించిన నరసింహన్‌ను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కలిసినవారిలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌నేత జానారెడ్డి, సీఎస్ ఎస్కే జోషి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు ఉన్నారు.
Pragathi-BhavanKCR1

259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles