ప్రగతిభవన్‌లో ఘనంగా దసరా

Thu,October 10, 2019 02:51 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కే చంద్రశేఖర్‌రావు తన అధికారిక నివాసంలో వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. వాహన పూజచేశారు. అనంతరం ఆయుధపూజ నిర్వహించి, పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజాకార్యక్రమంలో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత, అల్లుడు అనిల్‌కుమార్, మనుమలు, ఇతర కుటుంబసభ్యులు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles