ప్రశాంతంగా మిలాద్ ఉన్ నబి

Mon,November 11, 2019 02:05 AM

-హైదరాబాద్‌లో ర్యాలీల సందడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మిలాద్ ఉన్ నబి వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే ఈ పండుగకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. శనివారం అయోధ్య తీర్పు వెలువడటంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. హైదరాబాద్ పాతబస్తీతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. పాతబస్తీతోపాటు పలు ప్రాంతాల్లో ర్యాలీల కోలాహలం కనిపించింది.


ఈ సందర్భంగా నగర పోలీసులు ముందస్తుగా ఆయారూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ర్యాలీల్లో పాల్గొన్నవారికి మంచినీరు అందించారు. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలీసుల సూచనలకు ప్రజలు సహకరించడంతో ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి.

190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles