నిపుణుల తయారీ వేదిక భువిసంవాద్

Fri,November 8, 2019 02:12 AM

-జీఎస్‌ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్ వెంకటేశ్వర్‌రావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర గనుల మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న భువిసంవాద్ కార్యక్రమం విద్యార్థులు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకుల్లో నైపుణ్యాలను పెంపొందించే వేదిక అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ సంస్థ (జీఎస్‌ఐటీఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం నాగోలు, బండ్లగూడలోని జీఎస్‌ఐటీఐలో మైనింగ్ జియాలజీ, మోడలింగ్ ఫర్ మైనింగ్ అండ్ సివిల్ ఇంజినీర్స్ అనే అంశంపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మైనింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. నాలెడ్జ్ షేరింగ్ రంగంలో జీఎస్‌ఐటీఐ ముందంజలో ఉందని, విద్యార్థుల కోసం నీడ్ బేస్డ్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తున్నందుకు, మల్లారెడ్డి కాలేజ్ ఇఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వెంకటరామయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వజిత్ గంగోపాధ్యాయ, డాక్టర్ ఎస్ రవి, డాక్టర్ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

81
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles