విషపూరిత మందు తాగి..


Wed,June 12, 2019 03:17 AM

children-hospitalized-after-drinkig-poison Drug

-ముగ్గురు చిన్నారులకు అస్వస్థత
-ఒకరి పరిస్థితి విషమం

కోదాడ రూరల్: సబ్జాగింజలుగా భావించి విషపూరిత మందును నీటిలో కలుపుకొని తాగ డంతో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గుర య్యారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్బుల్ పనిచేసే రఫీ.. కృష్ణప్రియ థియేటర్ సమీపం లో ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు పర్హాన్(9), అస్మ(7) ఉన్నారు. మంగళవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలోని ఆటోడ్రైవర్ బాబు కూతురు అక్షిత(6)తో కలిసి ఆడుకుంటుండగా.. విషపూరిత మందు పొట్లం లభించింది. ఆ మందు నీలి రంగుగా ఉండటం తో సబ్జా గింజలుగా భావించి నీటిలో కలుపు కొని తాగారు. కొద్దిసేపటి తర్వాత ఇంటి ముం దు కూతురుతోపాటు ఇద్దరు చిన్నారులు పడిపోవడం చూసిన బాబు వారిని ఆటోలో ప్రభు త్వ దవాఖానకు తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని బాధితులు తెలిపారు.

4876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles