ముత్యంరెడ్డికి కన్నీటి వీడ్కోలు

Thu,September 5, 2019 02:13 AM

-తుక్కాపూర్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
-పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
-నివాళులర్పించిన ఎంపీ ఎమ్మెల్యేలు, కలెక్టర్

దుబ్బాక, నమస్తే తెలంగాణ: గుండెపోటుతో కన్నుమూసిన టీఆర్‌ఎస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని తనకిష్టమైన పొలంలోనే శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. తొగుటలో ముత్యంరెడ్డి నివాసం నుంచి తుక్కాపూర్‌లోని వ్యవసాయక్షేత్రం వరకు వేలమందితో అంతిమయాత్ర సాగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యేలు సునీతాలకా్ష్మరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితోపాటు పార్టీలకతీతంగా నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు వేలమంది అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి తండ్రికి అంతిమసంస్కారాలు నిర్వహించగా.. పోలీసులు గౌరవసూచకంగా గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. పలువురు నాయకులు ముత్యంరెడ్డి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. జిల్లాలో ఓ మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Muthireddy1

308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles