స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య కన్నుమూత


Thu,July 26, 2018 01:25 AM

Chandraya passed away from freedom fighters

భీమదేవరపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసేవకు డు పడాల చంద్రయ్య (95) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మం డలం ములకనూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచా రు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చంద్రయ్య జైలుజీవితం గడిపారు. నాగపూర్‌లో సాయుధ శిక్షణ పొంది అక్కడే దళకమాండర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రానంతరం సామాజిక, రాజకీయ కార్యక్రమా ల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోషలిస్టుపార్టీలో చేరి వ్యవసాయ కూలీలు, పాలేర్లకు సంఘాలను ఏర్పాటుచేశారు. పట్వారీలు, జమీందార్లు, దొరల ఆకృత్యాలను ఎదురించి పీడిత ప్రజల పక్షాన నిలిచారు. పాత కరీంనగర్ జిల్లా వంగరకు సైకిల్‌పై వెళ్లి పీవీ నర్సింహారావు వద్ద ఇంగ్లిషు నేర్చుకున్నారు. చంద్రయ్య చివరికోరిక మేరకు అతని పార్థీవదేహాన్ని కుటుంబసభ్యులు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించా రు.

చంద్రయ్య మృతి తీరనిలోటని కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, స్వాతంత్య్ర స మరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జపురి వెంకటయ్య అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి చంద్రయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు.

665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles