గులాబీ వనంగా పరకాల


Thu,December 6, 2018 02:50 AM

challa dharma reddy will be victory in Parkal

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పోరాటాల పురిటి గడ్డ పరకాల ఇప్పుడు గులాబీ వనంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విజయం ఖాయమని పార్టీ కార్యకర్తలు ఘంటాపథంగా చెప్తున్నారు. నిజాం వ్యతిరేక పోరాటం నుంచి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానిది ఆదినుంచి అగ్రస్థానమే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విలక్షణ భౌగోళికత కలిగిన ఈ సెగ్మెంట్ పునర్విభజన తర్వాత కుదించబడింది. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు, ఒక ఉపఎన్నిక జరిగాయి.

టీఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పరకాల నియోజకవర్గం పునర్విభజనలో మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి, రేగొండ మండలాలను కోల్పోయి పరకాల కేంద్రంగా కొత్తగా ఆత్మకూరు, దామెర, నడికూడ, గీసుకొండ, సంగెం మండలాలతో ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు టీఆర్‌ఎస్ నాయకులకు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. టీడీపీ తరఫున 2014 ఎన్నికల్లో గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈ నాలుగేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ప్రజలు ఈసారి ధర్మారెడ్డిని గెలిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
challa-dharma-reddy2

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles