సగానికిపైగా తగ్గిన పప్పుల ధరలుSat,May 20, 2017 02:11 AM

-కందిపప్పు కిలో 80, పెసరుపప్పు 90, మినుపపప్పు 110

pulses
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గతకొన్నేండ్లుగా ఆకాశాన్నంటిన పప్పుల ధరలు దిగివచ్చాయి. కనీసం రూ.150 పైనే ఖర్చుచేస్తే కానీ కొనలేని కందిపప్పు ధర ఇప్పుడు సగానికిపైగా తగ్గడంతో సామాన్యుడి మొహంలో చిరునవ్వు కనిపిస్తున్నది. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పప్పుధాన్యాలు పండించేందుకు ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. పత్తికి బదులుగా కంది, పెసర, మినుము, శెనగ వంటి పప్పుధాన్యాల సాగు చేయాలన్న ప్రభుత్వ సూచనలతో రైతులంతా అపరాల సాగువైపు మళ్లారు. దీంతో పప్పుధాన్యాల దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. అదే సమయంలో పప్పుధాన్యాలను నల్లబజార్లకు తరలించే అక్రమార్కు లపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ చర్యల ఫలితంగా సామాన్యుడు సంతోషంగా పప్పన్నం తింటున్నాడు.
Meterial
మార్కెటింగ్‌శాఖ సమాచారం ప్రకారం గతేడాది మే 18న కిలో కందిపప్పు ధర మార్కెట్‌లో రూ.168 ఉండగా, ఇప్పుడు రూ.80కి దిగివచ్చింది. అదేవిధంగా మిగిలిన పప్పుల ధరలు సగానికిపైగా తగ్గాయి. గత రెండు నెలలుగా పప్పుధాన్యాల కొనుగోళ్లు పెరిగినట్టు దుకాణాదారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు హోల్‌సేల్ మార్కెట్లలో పప్పులు కొనే వినియోగదారులు పెరిగినట్టు వారు తెలిపారు. ప్రస్తుతం పెసరుపప్పు కిలో ధర బహిరంగ మార్కెట్‌లో రూ.90 ఉండగా, రైతుబజార్‌లో రూ.85 ఉన్నట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. మినుపపప్పు ధర సైతం దిగివచ్చింది. కిలో మినుపపప్పు గతేడాది రూ.210 ఉండగా.. ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు తగ్గి రూ.110లకే దొరుకుతున్నది. శెనగపప్పు కిలో ధర బహిరంగ మార్కెట్‌లో రూ.90కి, రైతు బజార్లలో రూ.85కి చేరింది.

4289

More News

VIRAL NEWS