ఓటరు తీర్పు నేడే


Thu,May 23, 2019 02:24 AM

CEO Rajath Kumar Press conference over Telangana Vote counting process

- టిక్ టిక్ టిక్.. కొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర
- 542 లోక్‌సభ నియోజకవర్గాలు..నాలుగు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు
- రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల్లో..
- ఉదయం 11-12 గంటలనుంచే ట్రెండ్స్
- రెండుగంటలకల్లా పలుస్థానాల్లో స్పష్టత
- వీవీప్యాట్ల లెక్కింపు తర్వాతే అధికారిక ప్రకటన
- వీవీప్యాట్లను ముందే లెక్కించాలన్నవిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన ఈసీ


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉత్కంఠ వీడబోతున్నది. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పి నా.. దేశవ్యాప్తంగా ఓటరు నాడి ఎటు కొట్టుకున్నదో.. విజేతలెవరో తేలిపోనున్నది. స్వతంత్ర భారతావనిలో మునుపెన్నడూ చూడనంత పోటాపోటీగా.. ఏడు విడుతల్లో దాదాపు 40 రోజులపాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన ఓట్ల లెక్కింపు.. మరికొద్దిగంటల్లో మొదలుకానున్నది. ఢిల్లీ పీఠం ఎవరిదో నిర్ణయించే ఈ ప్రక్రియలో ప్రాథమిక సరళి ఉదయం 11-12 గంటల నుంచే వెల్లడికానున్నది. మధ్యాహ్నం రెండు, మూడు గంటలకల్లా విజేతలపై స్పష్టత రానున్నది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు కూడా లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతోపాటే నిర్వహించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రా రంభమయ్యే ఓట్ల గణనలో మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెట్టి.. తదుపరి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఐదేసి పోలింగ్ బూత్‌ల నుంచి వీవీప్యాట్లను ఎంపికచేసి లెక్కించనున్నందున విజేతల ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడుతాయని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో 42 రోజుల నిరీక్షణకు తెర

తొలి విడుతలోనే పోలింగ్ పూర్తయిన తెలంగాణలో 42 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. తీర్పు అధికార టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగానే ఉంటుందని తేలిపోయినప్పటికీ.. లెక్కింపుపై ఉత్కంఠ ఉన్నది.
Rajath-Kumar2

ఉదయం 4 గంటల నుంచే

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల తాళాలు ఉదయం నాలుగు గంటలకే తెరుచుకోనున్నాయి. ఈ మేరకు లెక్కింపు సిబ్బంది విధుల్లో ఉండాలని ఈసీ ఆదేశాలిచ్చింది. నిర్ణీత సమయానికి నిర్దేశిత ప్రాంతాలకు చేరుకున్న సిబ్బందికి ఏ కౌంటింగ్ టేబుల్ వద్ద విధులు నిర్వహిస్తారో రిటర్నింగ్ అధికారులు చెప్పి.. వారితో ప్రమాణం చేయిస్తారు. ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుపెడుతారు. ముందుగా సర్వీసు ఓట్లు, ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తదుపరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. వీటిని దాదాపు 8.30 గంటల్లోపే పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లను తెరుస్తారు.

11 గంటల నుంచే ట్రెండ్స్!: వీవీప్యాట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతున్నప్పటికీ.. అభ్యర్థుల విజయావకాశాల సరళి ఉదయం 11-12 గంటలనుంచే వెల్లడికానున్నది. మధ్యాహ్నం 2- 3 గంటల సమయానికి ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుతుందని అం చనా. అప్పటికల్లా విజయం ఖరారు కానుంది. చివరకు లాటరీ తీసి వీవీప్యాట్లను లెక్కించాల్సి వస్తుండటం, దానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుండటంతో విజేతను ప్రకటించరు. అయినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటల వరకు విజేతలెవ్వరో తేలిపోనుంది.
Rajath-Kumar3

689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles