ఎమ్మెస్పీ అమలులో కేంద్రం వైఫల్యం

Mon,November 11, 2019 02:20 AM

-పరిమితుల మేరకే కొనుగోళ్లకు అనుమతి
-రాష్ట్ర ప్రభుత్వంపై తప్పని భారం
-పూర్తి ఉత్పత్తులకు అందని కనీస మద్దతు ధర

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: పంట ఉత్పత్తు ల కొనుగోలులో కేంద్రం పరిమితులు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నది. ఈ క్రమంలో రైతులకు కనీస మద్దతు ధర రాక నష్టపోతున్నారు. మొత్తం పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే విధానాలను తీసుకొస్తున్నామని రెండేండ్లుగా చెపుతున్న కేంద్రం.. ఎప్పటిలాగే ఎమ్మెస్పీ కొనుగోళ్లకు పరిమితుల మేరకే అనుమతులు ఇస్తున్నది. మార్కెట్ హామీ పథకం (ఎమ్మెస్పీ) తెస్తున్నామని ప్రకటించి, విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వాటిని అమల్లోకి తీసుకురాలేదు.

పంట ఉత్పత్తుల కొనుగోలుకు రివాల్వింగ్ ఫండ్ కేంద్రమే ఇవ్వాలని గతంలో ప్రతిపాదించినా అది అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో సోయాబీన్ 2.82 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని ముందస్తు అంచనా నివేదికలో అర్థగణాంకశాఖ వెల్లడించగా.. కేవలం 58,608 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో మిగిలిన 2.23 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్‌ను మద్దతు ధర కంటే తక్కువకే రైతులు అమ్ముకునే పరిస్థితి తలెత్తుతున్నది. అలాగే పెసర్లను 10,378 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఇందులో ఐదువేల మెట్రిక్ టన్నులు క్వింటాకు రూ. 7,050 చొప్పున 5,500 మంది రైతుల నుంచి కొనుగోలుచేశారు. నాఫెడ్ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఇంకా చెల్లింపులు ప్రారంభించలేదు. మక్కజొన్నను 13.79 లక్షల మెట్రిక్ టన్నులు, కందు లు 1.94 లక్షల మెట్రిక్ టన్ను ల ఉత్పత్తి రానున్నట్టు అంచనా.

ఇందులో మక్కజొన్న రైతులకు ఎమ్మెస్పీకి రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. పౌల్ట్రీ వ్యాపారులు కూడా ఎమ్మెస్పీకి మక్కజొన్నను సేకరిస్తారు. కందు లు మాత్రం ప్రతి ఏడాది కేంద్ర పరిమితులు విధించడంతో ప్రభుత్వం నిధులు వెచ్చించి, రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు చేపడుతున్నది. గతేడాది వానకాలంలో రూ. 541.69 కోట్లతో 95,451 మెట్రిక్ టన్నుల కందులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిం ది. 4.16 లక్షల మెట్రిక్ టన్నులు మక్కజొన్నను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.708.09 కోట్లు అవసరమయ్యా యి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చినా.. ఆ స్థాయిలో నిధుల సమీకరణ లేకపోవడం, మిగతా పంటలన్నింటికీ కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌కు ఈసారి దాదాపు రూ.1,000 కోట్ల నుం చి రూ.1,500 కోట్లు అవసరం పడతాయి. అయితే మార్క్‌ఫెడ్ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాల్సి ఉండటంతోపాటు, ఈ వానకాలం ప్రారంభంలోనే యూరియా కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నది. ఇది నిధుల సమీకరణకు అవరోధంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles