ఇద్దరిని బలిగొన్న అతివేగం

Mon,November 11, 2019 02:30 AM

-మరో నలుగురికి స్వల్ప గాయాలు
-బయోడైవర్సిటీ ైఫ్లెఓవర్‌పై కారు బీభత్సం
-మద్యం మత్తులో కారు నడిపిన ఐటీ ఉద్యోగి

శేరిలింగంపల్లి: మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును అతివేగంగా నడిపి ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బయోడైవర్సిటీ ైఫ్లెఓవర్‌పై చోటుచేసుకున్నది. కూకట్‌పల్లిలోని శాంతినగర్‌లో నివాసముండే పీ అభిలాశ్ గచ్చిబౌలిలోని కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన అభిలాశ్ రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ వైపు బయోడైవర్సిటీ ైఫ్లెఓవర్‌పై కారులో వేగంగా వెళ్తున్నాడు.

ైఫ్లెఓవర్‌పై మలుపు వద్ద రోడ్డు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సరూర్‌నగర్‌కు చెందిన వొడాఫోన్ సిమ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎన్ సాయివంశీ రాజు (22), మహబూబ్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ వీ ప్రవీణ్‌కుమార్ (22)ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ ైఫ్లెఓవర్‌పై నుంచి ఎగిరి కింద రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందారు. అదే వేగంతో దూసుకెళ్లిన కారు మరో రెండు బైక్‌లను కూడా ఢీకొట్టింది. ఆ బైక్‌లపై వెళ్తున్న ఆదిలాబాద్‌కు చెందిన చుంచు సాయికృష్ణ (21), అతని సోదరుడు పవన్‌కుమార్ (19), తూర్పు గోదావరికి చెందిన పడాల మురళీకృష్ణ (30), గిరిధర్ సుభాష్ (26)లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సాయివంశీ రాజు, ప్రవీణ్‌కుమార్ మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles