కొబ్బరిబొండాల లోడులో గంజాయి


Sat,September 14, 2019 12:49 AM

Cannabis loads of coconuts

-రూ.7.38 లక్షల విలువైన 246 కిలోలు స్వాధీనం
కారేపల్లి రూరల్: కొబ్బరిబొండాల లోడు మధ్యలో పెట్టి ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి రవాణా గుట్టురట్టయింది. కొబ్బరిబొండాల లోడుతో వస్తున్న బొలేరో ట్రక్ శుక్రవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని గాంధీనగర్ రైల్వేగేట్ సమీపంలో చెట్టును ఢీకొని బోల్తా పడింది. గ్రామస్థులు వెళ్లి చూడగా కొబ్బరిబొండాలతోపాటు గంజాయి ప్యాకెట్లు కనిపించగా, సింగరేణి పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రక్‌లో ఒక్కోటి 1.8 కిలోల బరువైన 137 గంజాయి ప్యాకెట్లు (మొత్తం 246 కిలోలు) ఉండగా, వీటి విలువ రూ.7.38 లక్షలు ఉంటుందని తెలిపిన సింగరేణి సీఐ శ్రీనివాసులు, తాసిల్దార్ స్వామి గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు.

340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles