రాఘవాచారి గొప్ప మానవతావాది

Mon,November 11, 2019 01:36 AM

- సంస్మరణ సభలో పలువురు వక్తలు


బషీర్‌బాగ్‌: సీనియర్‌ పాత్రికేయుడు సీ రాఘవాచారి గొప్ప మానవతావాది అని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని నేటితరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల కన్నుమూసిన సీ రాఘవాచారి సంస్మరణ సభ ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాఘవాచారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం తుదిశ్వాస వరకు పోరాడిన రాఘవాచారి జయంతి (సెప్టెంబర్‌ 10) రోజున మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో స్మారకోపన్యాసం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన మహావ్యక్తి రాఘవాచారి అని, ఆయన ఆశయాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్‌అలీ, రాఘవాచారి సతీమణి జ్యోత్స్న, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, అమర్‌నాథ్‌, కే సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టులు రాజేందర్‌, రాజేశ్వర్‌రావు, ఏపీ రాష్ట్ర ఎనర్జీ కార్పొరేషన్‌ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజేశ్‌, హెచ్‌యూజే కార్యదర్శి శిగ శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

78
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles