దళారులకు చెక్ పెట్టేలా ప్రణాళిక


Thu,May 16, 2019 02:19 AM

C Parthasarathi Plan to check for Dealers

-రైతులకు గిట్టుబాటు ధర
-సమీక్షలో సీ పార్థసారథి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రతిరైతు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందేలా, వినియోగదారులకు సరసమైన ధరలకు ఉత్పత్తులు లభించేలా దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి చెప్పా రు. జీడిమెట్లలోని పూలు, పండ్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యానశాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఉద్యాన పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రాంతాల అనుకూలత, రాష్ట్ర అవసరాలు దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు వేసేలా విస్తరణ వ్యవస్థ పనిచేయాలన్నారు. పారిశ్రామిక అవసరాలు తీర్చే పంటల సాగుకు రైతులు సిద్ధంకావాలని సూచించారు. అవసరమున్న ప్రతిచోట పంటల విలువల జోడింపుకు అవసరమైన సంఖ్యలో మిల్లులు నెలకొల్పే పాలసీలు తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్న చింత, శాండల్‌వుడ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందిస్తామని, ఇప్పటికే వర్షాధార ప్రాంతాల్లో శాండల్‌వుడ్ నాటుకునేందుకు పది లక్షల మొక్కలు సిద్ధంచేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కే రవీందర్‌రెడ్డి, డీన్ డాక్టర్ విజయ, పరిశోధన సంచాలకుడు డాక్టర్ భగవాన్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles