సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు బిజినెస్ వింగ్


Wed,September 12, 2018 12:57 AM

Business Wing for Center for Good Governance

-పౌరసరఫరాల సంస్థ పాలకమండలి నిర్ణయం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పౌరసరఫరాల సంస్థలో కొత్తగా ఏర్పాటుచేసే బిజినెస్ విభాగానికి బిజినెస్ మోడల్‌ను రూపొందించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ని కన్సల్టెన్సీగా నియమించాలని పౌరసరఫరాల సంస్థ పాలకమండలి నిర్ణయించింది. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో పాలకమండలి సమావేశమై ఈ మేరకు నిర్ణయంతీసుకున్నది. పౌరసరఫరాల సంస్థలో వ్యయాన్ని తగ్గించి, ఆర్థికవనరులను మెరుగుపరచడంపై పేరొందిన సంస్థల నిపుణులతో అధ్యయనం చేయించేందుకు పలు సంస్థలను ఆహ్వానించింది. పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తక్కువకు టెండర్‌ను కోట్ చేసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను ఈ ప్రాజెక్టును అప్పగించాలని పాలకమండలి నిర్ణయించింది.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles