హైదరాబాద్‌లో బౌద్ధుల ఆనవాళ్లు


Wed,June 12, 2019 02:31 AM

Buddhist landmarks in hyderabad

చైతన్యపురిలో మూసీ ఒడ్డున వెలుగులోకి..
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బౌద్ధుల ఆనవాళ్లు తొలిసారిగా హైదరాబాద్ మహానగరంలోనూ వెలుగుచూశాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లా ఫణిగిరి, నాగారం తదితర ప్రాంతాల్లో మాదిరిగానే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ పరిధి చైతన్యపురిలోని మూసీనది ఒడ్డున ఆనవాళ్లు లభించాయి. చైతన్యపురిలోని కోసగుండ్ల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్న గుట్టపై రాళ్లతో నిర్మించిన స్తూ పం అవశేషాలతోపాటు కొత్త రాతియుగం నాటి ఆనవాళ్లను బుద్ధవనం ప్రాజెక్టు అధికారు లు గుర్తించారు. 1982లో కోసగుండ్ల గుట్టపై ఆలయం నిర్మించినప్పుడే ఇక్కడ విష్ణు కుండినుల కాలంనాటి శాసనం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్రంలో లభ్యమైన తొలి ప్రాకృత శాసనం ఇదేనని తెలుస్తున్నది. ఇక్కడి బౌద్ధుల ఆనవాళ్లపై పురావస్తుశాఖ ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నిఫుణుడు, చరిత్ర పరిశోధకుడు ఎంఏ శ్రీనివాసన్, ప్రాజెక్టు డిజైన్ ఇంచార్జి శ్యామ్‌సుందర్‌రావు ఇటీవల ఈ గుట్టపై పరిశోధనలు జరిపారు. రాళ్లతో నిర్మించిన తోవలను, నాలుగు రాతి స్తూపాల అవశేషాలను గుర్తించారు. గుట్టపై కొత్తరాతి యుగపు ఆనవాళ్లూ లభించాయి. మూసీనది ఒడ్డున ఓ రాయిపై అప్పటి పెయింటింగ్‌ను కనుగొన్నారు.

తవ్వకాలు చేపట్టాలని లేఖ రాశాం

చైతన్యపురిలోని మూసీనది ఒడ్డున బుద్ధవనం ప్రాజెక్టు సిబ్బంది బౌద్ధ ఆరామాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. ఇక్కడ ఒక శాసనం మాత్రమే గతంలో లభించగా ప్రస్తుతం స్తూపాల అవశేషాలను గుర్తించాం. చైతన్యపురిలో బౌద్ధానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశాం.
- మల్లెపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles