మూషిక జింకలకు ఊపిరి

Thu,December 5, 2019 02:31 AM

-ప్రయోగం విజయవంతంకావడం దేశానికే గర్వకారణం
-కేంద్ర అటవీశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ నాగి ప్రశంసలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో మూషిక జింకల సంతతిని రక్షించడానికి జరుగుతున్న ప్రయోగం అద్భుతంగా ఉన్నదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ నాగి ప్రశంసించారు. దేశంలో అంతర్ధానదశకు చేరుకున్న అత్యంత అరుదైన మూషిక జింకలకు తెలంగాణలో తిరిగి ఊపిరిపోసి అడవుల్లో వదలడం శుభపరిణామమని చెప్పారు. తెలంగాణ అటవీశాఖ, సీసీఎంబీ ల్యాకోన్స్ ఆధ్వర్యంలో జరిగిన మూషిక జింకల సంతానవృద్ధి ప్రయోగం విజయవంతంకావడం దేశానికే గర్వకారణమని ఆయన కితాబిచ్చారు. బుధవారం హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్‌లో మౌస్ డీర్ బ్రీడింగ్ సెంటర్‌ను, జూపార్క్‌ను నాగి సందర్శించి, నిర్వహణ పద్ధతులను పరిశీలించారు.

జంతువులకు కల్పిస్తున్న వసతులు, పరిశుభ్రత, ఆహారభద్రత ఇలా అన్ని అంశాల్లో జూపార్క్ ముందంజలో ఉన్నదని కొనియాడారు. జంతువుల చికిత్సకు అత్యాధునిక పరికరాలను వెంటనే మంజూరుచేస్తామని ఆయన హామీఇచ్చారు. నెహ్రు జూను దేశంలోనే మోడల్ జూగా అభివృద్ధి పరచడానికి తీసుకుంటున్న చర్యలను, మూషిక జింకల సంతానాన్ని వృద్ధిచేసి వాటిని తిరిగి అడవుల్లో వదిలే ప్రక్రియను క్యూరేటర్ క్షతిజ.. నాగికి వివరించారు. ఇప్పటివరకు 160 వరకు మూషిక జింకలను అడవుల్లో వదిలినట్టు చెప్పారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంట అసిస్టెంట్ క్యురేటర్ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.

329
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles