గర్భనిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్!


Thu,September 12, 2019 03:09 AM

Breast cancer with contraceptive pill

పెండ్లయిన తర్వాత రెండేండ్ల వరకైనా పిల్లలు వద్దనుకుంటున్నారు ఈ కాలపు దంపతులు. గర్భనిరోధక పద్ధతులెన్ని ఉన్నా కాంట్రాసెప్టివ్ పిల్స్‌నే ఎక్కువమంది వాడుతుంటారు. అయితే ఈ గర్భనిరోధక మాత్రలను ఎక్కువకాలం వాడితే రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమయ్యాయి. అండాశయ హార్మోన్లయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లకు ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్కు అంత ఎక్కువగా ఉంటుంది. నెలసరి తొందరగా ప్రారంభమైనా, మెనోపాజ్ ఆలస్యంగా వచ్చినా అలాంటివాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత ఎక్కువ. గర్భనిరోధక మాత్రల్లో ఈ హార్మోన్లే ఉంటాయి. అందుకే వీటిని వాడటంవల్ల ఆయా హార్మోన్లకు ఎక్స్‌పోజ్ అవుతారు. దీర్ఘకాలం ఈ మాత్రలను వాడితే మరింత ఎక్కువకాలం హార్మోన్లకు ఎక్స్‌పోజ్ అవుతారు. అందువల్ల ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయంటున్నారు ఎయిమ్స్ పరిశోధకులు. పెండ్లయిన తర్వాత సంతానాన్ని వాయిదా వేయకపోవడమే మంచిదని, ఒకవేళ వెంటనే వద్దనుకున్నా ఇతర గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించడం మేలని సూచిస్తున్నారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles