బీజేపీ భిన్నమైన పార్టీ: జేపీ నడ్డా


Mon,August 19, 2019 01:48 AM

BJP Public Meeting in Hyderabad

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో ఉన్న పార్టీలన్నింటిలో బీజేపీ భిన్నమైనదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. తొలిసారిగా రాష్ట్రపర్యటనకు వచ్చిన ఆయన పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపే ప్రయత్నంచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని జోస్యంచెప్పారు. కొత్త నాయకులను కలుపుకొని నేతలంతా కలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీలో చేరారు. తొలుత పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశమైన నడ్డా.. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ముస్లిం మహిళల సమస్యలను అర్థంచేసుకొని ట్రిపుల్ తలాక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధాని ఆవాస్ యోజనతో ప్రతి కుటుంబానికి ఇంటిని నిర్మిస్తామన్నారు. 2020 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు.

టీడీపీ ఎంపీ గరికపాటి సంచలన వ్యాఖ్యలు


బీజేపీలో చేరిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు సంచలన వ్యాఖ్యలుచేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం మనసు చంపుకొని పార్టీ మారుతున్నామన్నారు.

145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles