పర్యాటక కేంద్రంగా భువనగిరి అభివృద్ధి


Wed,May 18, 2016 02:44 AM

Bhuvanagiri as a tourist destination development

booklaunch
-భువనైక సౌందర్యం పుస్తకావిష్కరణ సభలో మంత్రి చందూలాల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రకృతి ప్రసాదించిన వరం భువనగిరి పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమం, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ చెప్పారు. భువనగిరి కేంద్రంగా ఎందరో రాజులు పాలన సాగించారన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన భువనైక సౌందర్యం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలు భువనగిరి చరిత్ర తెలుసుకొనేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ వైభవోపేత చారిత్రక వారసత్వం తెలంగాణ సొంతమని, భువనగిరికి చారిత్రకంగా, పర్యాటక పరంగా ప్రత్యేకత ఉందని అన్నారు. పుస్తక రచయిత ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భువనగిరి కోటను పర్యాటక రంగ కేంద్రంగా అభివృద్ధిచేస్తే, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశాలు పుష్కలం అని అన్నారు. ఆయన తన పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి అంకితమిచ్చారు. రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు విశాలాక్షి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ సంగనభట్ల నర్సయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి వారసత్వ సంఘం ప్రతినిధి వెంకట్‌రెడ్డి, ప్రచురణ కర్త భగవాన్ పాల్గొన్నారు.

1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS